టాలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశమైన నాగబాబు ట్వీట్!

6:03 pm, Sat, 30 May 20

హైదరాబాద్: సినీ నటుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

పిచ్చికుక్కలు ప్రమాదకరమంటూ ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట సంచలనమైంది. వివరాల్లోకి వెళితే… ప్రజారోగ్య హెచ్చరిక అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

దాని సారాంశం ఏంటంటే.. ‘‘పిచ్చి కుక్కలతో వ్యవహారం ప్రమాదకరం. వాటిని బంధించాలి లేదా ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి.

 

కానీ వాటిపట్ల నిర్లక్ష్యం తగదు. ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అసలే ఇది పిచ్చికుక్కల కాలం’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

గత రెండు రోజులుగా మెగా, నందమూరి కుటుంబాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని యాదవ్‌తో సినీ పరిశ్రమ ముఖ్యులు భేటీ కావడంతో అసలు రచ్చ ప్రారంభమైంది.

తనను ఎవరూ పిలవలేదని, భూములు పంచుకోవడానికి సమావేశమయ్యారా అంటూ బాలయ్య వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.

బాలయ్యను పిలవకపోవడం బాధకరమేనన్న నాగబాబు.. అయితే భూములు పంచుకోవడం అన్న మాట సరైనది కాదని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం ఒక్కో మలుపుతీసుకుంటోంది.