‘మజిలీ’లో చై , సామ్ నటనకు నాగార్జున ఫిదా! ఏమన్నారంటే…

3:19 pm, Fri, 5 April 19
nagarjuna

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం, తన కొడుకు, కోడలు నటనకు ఫిదా అయినట్టు నాగ్ తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. మజిలీ చిత్రంలో నాగచైతన్య, సమంత తిరుగులేని నటన కనబర్చారని అభినందించారు. వారి నటన పట్ల గర్విస్తున్నానని, రావు రమేశ్, పోసాని కూడా ఆకట్టుకున్నారని నాగ్ ట్వీట్ చేశారు. అంతేకాదు, మజిలీ చిత్ర బృందానికి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. పెళ్లయిన తర్వాత చైతూ, సామ్ జంటగా నటించిన చిత్రం ఇదే.

దాంతో సినిమా విడుదలకు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల కంటే ఒక్కరోజు ముందుగానే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ షోలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ప్రీమియర్ షోల ద్వారా 135,171 డాలర్లు వసూలైనట్లు తెలుస్తోంది