నాని లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడో తెలుసా?

12:04 pm, Tue, 9 April 19
nani

హైదరాబాద్: నాని తాజా చిత్రంగా ‘జెర్సీ’ రూపొందింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది.

క్రికెటర్ పాత్రలో నాని

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడమే కాకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు.

15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతవరకూ చేయని పాత్రలో నాని కనిపించనున్నాడు. కథాకథనాలు  పాత్రలను మలిచిన తీరు .. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయని అంటున్నారు. ఇది నాని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రమవుతుందేమో చూడాలి