ద్విపాత్రాభినయంతో అందరినీ హడలెత్తించనున్న నయన్!

10:27 am, Mon, 18 March 19
Nayan who is going to scare everyone with a double racquet!, Newsxpressonline

చెన్నై: తమిళనాట కథానాయికగా నయనతార తిరుగులేని కెరియర్ ను కొనసాగిస్తోంది. విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలు నయనతారకి వీలైనన్ని విజయాలను కట్టబెడుతున్నాయి. ఆమె తాజా చిత్రంగా ‘ఐరా’ రూపొందింది.

మరో హారర్ థ్రిల్లర్…

సర్జున్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ లో, నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.హారర్ సినిమాల్లో చేయడం నయనతారకి కొత్తకాదు. కానీ ద్విపాత్రాభినయం చేయడం ఆమెకి ఇదే మొదటిసారి. ఈ అంశమే ఈ సినిమాకి ఆసక్తికరమైనదిగా మారింది.

కోటపాడి రాజేశ్, మహేశ్వరన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, తమిళంలో ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఈ రెండు భాషల్లోను నయనతార ఒకేసారి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.