రాజ్ తరుణ్-నిత్యామీనన్‌లు జంటగా వెరైటీ లవ్ స్టోరీ!

9:28 am, Fri, 10 May 19

హైదరాబాద్: వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్…రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా, జి.ఆర్. కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’లో రాజ్ తరుణ్ హీరోగా ఛాన్స్ కొట్టేశాడు.

ఇటీవలే లాంచ్ అయిన…. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకముందే రాజ్ తరుణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చదవండిఅవతార్-2 రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన జేమ్స్ కామెరూన్!

‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా తెరకెక్కించే వెరైటీ లవ్ స్టోరీకి రాజ్ తరుణ్ ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నిత్యామీనన్ నటించనుందని టాక్.

ఇందులో హీరోయిన్ పెద్దగా, హీరో చిన్నగా ఉంటారట.  వారి నడుమ నడిచే లవ్ స్టోరీయే సినిమా అట.  అయితే రాజ్ తరుణ్, నిత్యా మీనన్ మధ్య వయసులో తేడా కొట్టొచ్చినట్టు కనబడతుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

చదవండిమరోసారి లవ్‌స్టోరీతోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అఖిల్!