తమిళ్ సినిమా స్ఫూర్తితో నితిన్ మూవీ?

4:52 pm, Mon, 1 April 19
Nithin Latest News, Telugu Movie Latest News, Newsxpressonline

హైదరాబాద్: తెలుగులోని యువ కథానాయకులతో నితిన్ తన పోటీని కొనసాగిస్తున్నాడు. పరాజయాలు ఎదురవుతున్నా విజయాలను అందుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేయనున్నట్టు చెప్పాడు.

ఈ సినిమాకి పవర్ పేట అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తమిళంలో ధనుశ్ చేసిన వడ చెన్నై స్పూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెన్నైలో రౌడీయిజానికి కేరాఫ్ అడ్రెస్ అయిన వడ చెన్నై అనే ప్రాంతంలో ధనుశ్ సినిమా రూపొంది సక్సెస్ అయింది.

అలాగే ఏలూరులోని పవర్ పేట ప్రాంతం నేపథ్యంలో నితిన్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాను మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. పవర్ పేట తరువాత సీక్వెల్ గా మరో రెండు భాగాలు రూపొందుతాయన్న మాట. ఇలా సీక్వెల్స్ గురించి కూడా ముందుగానే చెప్పడం విశేషం.

చదవండి: బిగ్ బి సరసన నటించనన్న రమ్యకృష్ణ!