ఆర్ ఆర్ ఆర్ గురించి ఎన్టీఆర్ బయటపెట్టిన మరో సీక్రెట్

10:40 am, Sat, 30 March 19
NTR Latest News, RRR Movie Latest News, Tollywood Latest News, Newsxpressonline

హైదరాబాద్: రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి మరో సీక్రెట్ అంటూ జూనియర్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. అయితే అసలు విషయం తెలుసుకుని జూనియర్ కు కూడ రాజమౌళిలాగే సినిమా ప్రమోషన్ విషయాలలో మంచి తెలివితేటలు వచ్చాయి అంటూ అతడి అభిమానులే షాక్ అయ్యారు.

వివరాలలోకి వెళితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఉత్తర భారతంలో జరగబోతోంది. ఈ చిత్ర యూనిట్ పూణే డిల్లీ వడోదర కోల్ కతా లాంటి నగరాల్లో భారీ షెడ్యూల్స్ కి ప్లాన్ చేసింది. ఈ సందర్భంలో జూనియర్ చరణ్ తో కలిసి నార్త్ ఇండియాకు బయలుదేరుతున్న విమానం టికెట్స్‌ ని తన ట్విటర్ ద్వారా షేర్ చేసాడు.

ఈ టిక్కెట్స్ పై జూనియర్ చరణ్ ల పేర్లు కనిపిస్తూ ఉండటంతో పాటు తామిద్దరం సుమారు రెండు నెలలు మళ్ళీ రాజమౌళి బందిఖానాలోకి వేల్లబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల జీవితాలకు సంబంధించిన స్పూర్తితో నిర్మిస్తున్న ఈమూవీ ఎక్కువగా ఉత్తర భారత దేశంలోనే నిర్మిస్తున్నారు.

1920 ప్రాంతాలలో స్వాతంత్రోద్యమం దక్షిణ భారతంలో కంటే ఎక్కువగా ఉత్తర భారతంలో జరిగిన నేపధ్యంలో సహజత్వం కోసం అప్పటి భవనాలు అదేవిధంగా అప్పటి ప్రదేశాలు ప్రతిబింబించేలా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ఉత్తర భారతాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు 400 కోట్ల భారీ బడ్జెట్ కావడంతో ఈమూవీ విషయాలటు ఎక్కువగా బాలీవుడ్ మీడియాలో కనిపించే విధంగా బాలీవుడ్ మీడియా దృష్టి ఆకర్షించడానికి ముందుగా ఈ ఉత్తర భారత షెడ్యూల్ వ్యూహాత్మకంగా రాజమౌళి మొదలు పెట్టాడు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..