‘యాత్ర’కి పోటీగా బరిలోకి దిగనున్న ఎన్టీఆర్ బయోపిక్!?

4:45 pm, Thu, 7 February 19
ntr biopic ,ysr biopic
ntr biopic ,ysr biopic
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల పులిబిడ్డ, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితంలోని ఒక కీలక ఘట్టాన్ని ఇతివృతంగా చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ సినిమా పూర్తిగా రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చుట్టే తిరుగుతుంది. రాజన్న పాదయాత్రను ఎందుకు చేయాలనీ అనుకున్నాడు, పాదయాత్ర ద్వారా రాజన్న ఏమితెలుసుకున్నాడు అనే కోణం ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఫ్రిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇదే ఫ్రిబ్రవరి 8న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కూడా మళ్లీ ఒకసారి ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. అదేంటి? ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరిలోనే రిలీజ్ అయింది, అలాగే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’  రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కదా అని గుర్తు అనుకుంటున్నారా?.. మీరు చదివింది నిజమే, అయితే అసలు విషయం ఇక్కడే ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే, ఎన్టీఆర్ బయోపిక్‌ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కూడా అదే రోజున ‘అమెజాన్ ప్రైమ్‌’లో అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ అయిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.