తీవ్ర విషాదం లో ఎన్టీఆర్…అయన మృతి తీరని లోటు!

1:32 pm, Mon, 6 May 19
NTR Latest News, Tollywood Latest News, AP Latest News, Newsxpressonline

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన అభిమానులను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమా వేడుకలోనూ ఫ్యాన్స్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడతారు. తన సినిమా వేడుక నుంచి ఇంటికి వెళ్లేపుడు జాగ్రత్తగా వెళ్లాలని జాగ్రత్తలు చెబుతారు. అభిమానులకు ఏమైనా అయితే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది.

అలాంటి వ్యక్తి తన తొలి అడుగు నుంచి వెన్నంటి ఉన్న అభిమానికి ఏమైనా అయితే ఎంత బాధ పడతారో మాటల్లో చెప్పడం కష్టమే. ప్రస్తుతం యంగ్ టైగర్ అలాంటి బాధలోనే ఉన్నారు. ముందు నుంచి తనకు తోడుగా ఉన్న అభిమాని ఇక లేరు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాధను వ్యక్తం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు.

నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. నిన్ను చూడాలని చిత్రం‌తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం‌గా ముగిసిపోతుంది అని ఊహించలేదు అని యంగ్ టైగర్ చెప్పుకొచ్చాడు. నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు.

ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు‌గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. జయదేవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. అంతేకాదు, జయదేవ్ తో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ లేఖ చూసిన అభిమానులు సైతం ఎమోషనల్ అయిపోతున్నారు. జయదేవ్ కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి కావడంతో జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా అభిమాన సంఘాల నాయకులు, ఫ్యాన్స్ తరలి వస్తున్నారు.