‘ఆర్ఆర్ఆర్’ న్యూ అప్డేట్: అజయ్ దేవగణ్ వచ్చేశాడు.. ఆహ్వానం పలికిన ఎన్టీఆర్

9:14 am, Thu, 30 January 20

హైదరాబాద్: రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం యావత్ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నాడు.

చదవండి: ‘అర్జున్‌రెడ్డి’ నయా మూవీ షురూ! శ్రీదేవి కూతురి స్థానంలో మరో నటి?

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. ప్రెస్‌మీట్‌లూ పెట్టలేదు.

గణతంత్ర దినోత్సవం రోజున ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ సెట్‌లో జెండా అవిష‌్కరించి ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసిందే. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి దిగిన పోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్‌లో ఈ ఫోటో పెట్టిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రపంచంలోకి స్వాగతం అంటూ క్యాప్షన్ తగిలించాడు.

చదవండి: పూజా హెగ్డే వీరాభిమాని.. ఆమె ఇంటికెళ్లి ఏం చేశాడో తెలుసా!?

రామ్‌చరణ్ దీనికి సంబంధించిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సెట్స్‌లోకి స్వాగతం, మీతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. మీ వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్ అని పేర్కొన్నాడు.

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది.

ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై 30న భారీ అంచనాల నడుమ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చదవండి: విజయశాంతిని చూస్తుంటే గుండె కొంచెం కిందికి జారుతోంది: చిరంజీవి