ఒకప్పుడు రూ.10 కోట్లు తీసుకున్న డైరెక్టర్.. ప్రస్తుతం ఇలా…

vv-vinayak
- Advertisement -

vv-vinayak

హైదరాబాద్: ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మనకి కలిసొచ్చినప్పుడు అగ్ర స్థానంలో ఉన్న మనమే, కాలం కన్నెర్ర చేస్తే పాతాళానికి పడిపోతాం. ప్రస్తుతం అలాగే ఉంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిస్థితి.

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో నాన్-బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన డైరెక్టర్ వి.వి.వినాయక్. సింగిల్ సినిమాతో రూ.150 కోట్ల వసూళ్లు తెచ్చాడు. 10 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఈ సినిమా దెబ్బతో బౌన్స్ బ్యాక్ అయినట్టే కనిపించాడు. కానీ ‘ఖైదీ’ తర్వాత వచ్చిన ‘ఇంటిలిజెంట్’ మూవీ వినాయక్ కెరీర్‌కి పెద్ద షాక్ ఇచ్చింది.

మాస్ మహారాజా అయినా ఆదుకుంటాడా?

ప్రస్తుతం దర్శకుడు వి.వి.వినాయక్ సింగిల్ ఆఫర్ లేక హీరోల చుట్టూ తిరిగే పరిస్దితి వచ్చింది. ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ నలుగురు‌కి పైగా హీరోలని కలిసినా ఎవరూ ఓకే చెప్పని దుస్దితి. గతంలో తాను మంచి హిట్లిచ్చిన హీరోలను సంప్రదిస్తున్నా ఫలితం లేకుండా పోతోందట. అందుకే చివరిగా ఆయన కారు ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ ఇంటి ముందు ఆగినట్లు సమాచారం.

గతంలో వీళ్లిద్దరి కలయికలో ‘కృష్ణ’ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఆ కృతజ్ఞతతో రవితేజ ఇప్పుడు తనకు మరో అవకాశం ఇస్తాడని వినాయక్ ఆశిస్తున్నాడు. మరీ రీసెంట్‌గా శ్రీనువైట్లతో ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ చేసి షాక్ తిన్న రవితేజ మరి వినాయక్‌కి అవకాశం ఇస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొత్తానికి వినాయక్ తరువాత సినిమాతో అయినా తన సత్తా ఏంటో చూపిస్తాడో లేదో వేచి చూడాలి.

- Advertisement -