సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన పరశురామ్!

12:45 pm, Mon, 18 March 19
Parashuram to hit Chance with superstar, Newsxpressonline

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ కెరియర్లోనే భారీ విజయాన్ని అందించింది. గీతా ఆర్ట్స్ వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే..

దీనితో చాలామంది యువ కథానాయకులు పరశురామ్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పరశురామ్ మాత్రం ఏకంగా మహేశ్ బాబుపైనే దృష్టి పెట్టాడు. అల్లు అరవింద్ సిఫార్స్ మేరకు తాజాగా మహేశ్ బాబును కలిసిన పరశురామ్, ఆయనకి ఒక లైన్ వినిపించాడట.

లైన్ బాగుండటంతో పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని మహేశ్ బాబు అన్నట్టుగా తెలుస్తోంది. దాంతో కథపై పరశురామ్ కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కథ నచ్చకపోవడం వల్లనే సుకుమార్ ప్రాజెక్టును మహేశ్ బాబు పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే.

అందువలన కథపై పరశురామ్ పూర్తి శ్రద్ధ పెట్టాడట. మహేశ్ బాబు ఓకే అంటే గీతా ఆర్ట్స్ పైనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది