రానా సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి!

3:50 pm, Mon, 29 April 19
Rana Daggubati Latest News, Priyamani Latest News, Tollywood Movie News , Newsxpressonline

హైదరాబాద్: తెలుగులో ‘యమదొంగ’.. ‘పెళ్లైన కొత్తలో’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రియమణి, ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించారు. కొత్త కథానాయికల పోటీ కారణంగా అవకాశాలు తగ్గుతూ రావడంతో సినిమాలకి ఆమె దూరమయ్యారు.

రానా సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తాజా సమాచారం. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఒక భారీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి విరాటపర్వం 1992 అనే టైటిల్‌ను పరిశిలీస్తున్నారు. దాదాపు ఈ టైటిల్‌నే ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్ర కోసం టబును తీసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను ప్రియమణిని తీసుకున్నారట. ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ప్రియమణికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.

చదవండి:  ముమ్మాటికీ ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యే: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శక నిర్మాతలు ఫైర్…