పూజా హెగ్డే వీరాభిమాని.. ఆమె ఇంటికెళ్లి ఏం చేశాడో తెలుసా!?

7:30 pm, Wed, 15 January 20

ముంబై: తెలుగులో అనతికాలంలోనే టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకున్న నటి పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకుపోతోంది. డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమాతో ప్రారంభమైన ఆమె జైత్రయాత్ర ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురంలో’ వరకు కొనసాగింది. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్లు కావడంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

చదవండి: కేరళలో ‘అలవైకుంఠపురంలో’ సరికొత్త రికార్డు! అభిమానులా.. మజాకా?

ప్రస్తుతం ప్రభాస్‌తో ‘జాన్’ సినిమా చేస్తోందీ అమ్మడు. అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. కాగా, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ముంబైలో పూజ ఉంటోన్న ఇంటికెళ్లి…

తాజాగా, భాస్కర్‌రావు అనే తెలుగు కుర్రాడు పూజా హెగ్డేకు వీరాభిమానిగా మారిపోయాడు. డీజే సినిమా నుంచే అతడు.. ఆమెకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాడు. పూజ ముంబైలో ఉందని తెలుసుకున్న భాస్కర్‌రావు అక్కడికి వెళ్లాడు. పూజ ఉండే ఇంటి బయట ఐదురోజులుగా ఉంటున్నాడు.

ఈ ఐదు రోజులు అక్కడే ఫుట్‌పాత్‌పై పడుకున్నాడట. ఎట్టకేలకు తన అభిమాన హీరోయిన్ పూజా హెగ్డేను కలుసుకోవడంతో అతడు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఆమెను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

ఐదు రోజులుగా ఫుట్ పాత్ మీదనే ఉన్నట్టుగా చెప్పడంతో పూజ కరిగిపోయింది. అతడి అభిమానానికి ఫిదా అయిపోయింది. చేయి అందించి షేక్ హ్యాండ్ ఇచ్చింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలంటూ అతడికి సూచించింది.

చదవండి: విజయశాంతిని చూస్తుంటే గుండె కొంచెం కిందికి జారుతోంది: చిరంజీవి