బికినీలో.. హాట్ హాట్ పోజులతో.. రెచ్చిపోతున్న పూజా హెగ్డే!

9:22 am, Mon, 15 April 19
pujahegde

హైదరాబాద్: టాలీవుడ్‌లో ‘ముకుందా’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో అచ్చం తెలుగింటి అమ్మాయిలా దర్శనమిచ్చిన నటి పూజా హెగ్డే ఒక్కసారే బాలీవుడ్‌లో మెరిసింది. తెలుగులో గ్లామర్ పాత్రలు రాకపోవడంతో తనకు సరైన అవకాశాలు రావడం లేదని బాాలీవుడ్‌కి జంప్ అయ్యింది ఈ సుందరాంగి.

చదవండి: వైరల్‌గా మారిన బిగ్‌బాస్ బ్యూటీ నగ్న ఫోటోలు!

కానీ అక్కడా పెద్దగా హిట్ కాలేకపోయింది. దాంతో పూజా మళ్లీ తెలుగు, తమిళ సినిమాలనే నమ్ముకుంది. అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో ఓ రేంజ్‌లో స్కిన్ షో చేసింది.. బికినీ అందాలతో పిచ్చెక్కించింది. ఇంకేముంది దర్శక, నిర్మాతల కళ్లు పూజాపై పడటం.. వరుసగా సినిమా చాన్సులు రావడం జరుగుతోంది.

ఇటీవల ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’లో నటించిన పూజా హెగ్డే.. ఆ తరువాత మహేష్ బాబు పక్కన ‘మహర్షి’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు ఈ అమ్మడ్ని వెతుక్కుంటూ వచ్చేశాయి.

చదవండి: డబ్బు కోసం 13 ఏళ్ల వయసులోనే నన్ను..: తల్లిపై నటి సంగీత సంచలన వ్యాఖ్యలు

పూజా తన అందచందాలు, శరీర సౌష్ఠవం పట్ల కూడా తగినంత శ్రద్ధ తీసుకుంటోంది. జిమ్‌లో తరచూ కఠినమైన కసరత్తులు చేస్తూ ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటోంది. తను జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి దృశ్యాలను ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తోంది. 

ఒక్క ఫోటోతో నెటిజన్ల గుండెల్లో గుబులు…

తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో పూజా ఒక బికినీలో దర్శనమిచ్చింది. ఈ కిరాక్ బ్యూటీ బికినీ ధరించి తలపై చేతులు పెట్టుకుని పచ్చని చెట్ల మధ్యలో ఖజురహో శిల్పంలా కనిపిస్తూ ఒంపు సొంపులను ఆరోబోస్తూ అదరహో అనిపిస్తోంది.

చదవండి: రూపాయి తీసుకోలేదు, చచ్చిపోతానేమో, ‘అలీతో సరదాగా’ షోలో రేణూ దేశాయ్!

అసలే కుర్రకారు.. అందునా సినిమా హీరోయిన్లపై విపరీతమైన మోజు.. ఇక పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ పెట్టిన ఈ ఫోటోను చూడగానే నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది. జస్ట్.. నాలుగు గంటల్లో మూడు లక్షలకు పైగా లైకులు కొట్టేశారు. అసలే వేసవి కాలం.. పచ్చని చెట్ల మధ్య పిచ్చెక్కించే అందాలు ప్రదర్శిస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి?