శివాజీ రాజా ప్యానల్ ఓటమికి రాజశేఖర్ కూతుళ్లే కారణం!

3:23 pm, Wed, 3 April 19
Shivaji Raja Panel Latest News, Rajasekher Daughter News, Newsxpressonline

హైదరాబాద్: మా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ ప్రమాణ స్వీకారం విషయంలో మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సహకరించడం లేదని, తన గడువు ఇంకా పది రోజులు ఉందని, పది రోజుల వరకు ఎవరూ ప్రెసిడెంట్ సీటును టచ్ చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారని మీడియా ముందుకు వచ్చి చెప్పడం అప్పట్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై మా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన హేమ… తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడానికి, శివాజీ రాజా ప్యానల్ ఓడిపోవడానికి గల కారణం కూడా వెల్లడించారు.

ప్రమాణ స్వీకారం రోజున నరేష్ అన్నీ నేను చేస్తున్నాను, నేను మీకు గిఫ్టు మీకు ఇస్తున్నాను అంటూ పలు వరాలు గుప్పించారు. ఆయనేమైనా ఇంట్లో నుంచి తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తున్నారా, అంటూ హేమ ప్రశ్నించారు. ఇది మా అసోసియేషన్, అందులో మేమంతా సభ్యులుగా సేవచేయడానికి పోటీ చేసి గెలిచి పదవులు దక్కించుకున్నామని, అందరి నిర్ణయం మేరకే ఏ తీర్మాణమైనా జరుగాలని హేమ వ్యాఖ్యానించారు.

నరేష్ తెలిసి చేశారా, ఎగ్జైట్మెంటులో తెలియక చేశారా, ఏమో తెలియదు. ఇతర కమిటీ సభ్యులను సంప్రదించకుండానే ప్రమాణ స్వీకారం సభలో అన్నీ పథకాలు ఎనౌన్స్ చేస్తున్నారు. వాస్తవానికి అలా చేయకూడదు. రాజీవ్ కనకాల కూడా మధ్యలో వెళ్లి మీరు ఇలా అనౌన్స్ చేస్తున్నారు.

ఇవి చేయడం ఎలా సాధ్యం? అని వెంటనే వెళ్లి చెవిలో చెప్పారు. ఏ విషయం అయినా ఈసీ మీటింగ్ పెట్టి మెజారిటీ సభ్యులు అమోదం తెలిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి, ఇదీ అసలు పద్దతి అని హేమ తెలిపారు.

రాజశేఖర్, జీవిత కూతుర్లు ఇద్దరూ 800 మందికి ఫోన్ చేశారు. ఆంటీ, అన్నయ్య, అంకుల్ అని ప్రేమగా పిలుస్తూ ఇలా మా డాడీ నిలబడుతున్నారు, వారి ప్యానల్‌ను గెలిపించండి అని కోరారు. మా ఎన్నికలపై వీరిద్దరి ప్రభావం బాగా పడింది. చివరి నిమిషంలో నాగబాబుగారు నరేష్ ప్యానల్ వైపు వెళ్లడం కూడా కొంత ఎఫెక్ట్ పడింది. అందుకే శివాజీ రాజా ప్యానల్ ఓడిపోయిందని హేమ తెలిపారు.

చదవండి: విడాకులవార్త పై ప్రియాంకచోప్రా పరువు నష్టం దావా!