జనసేన మేనిఫెస్టోపై హీరో రామ్ చరణ్ కామెంట్స్!

1:03 pm, Thu, 4 April 19
ramcharan comments on janasena manifesto

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నిన్న ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన మేనిఫెస్టోపై ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సమాజంలోని అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న జనసేన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని రామ్ చరణ్ కితాబిచ్చాడు.జనసేన ఎన్నికల్లో సరికొత్త ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి అభినందనలు తెలిపాడు.

ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్ బుక్ లో స్పందించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో #ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చేతికి చిన్న గాయం కావడంతో సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే చరణ్ తిరిగి మల్లి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

కొడుకు బర్త్‌డే కి తాత ఇచ్చిన గిఫ్ట్‌కి షాకైన అల్లు అర్జున్!