అభిమాని కోరిక తీర్చిన రష్మీ…

2:40 pm, Fri, 10 May 19

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే హాట్ యాంకర్ రష్మీ…..ఓ అభిమాని కోరికని తీర్చింది. ఆ అభిమాని అడిగిన కోరికని కాదనలేకపోయింది.  అసలు ఏం జరిగిందంటే ..తాజాగా ఓ అభిమాని ర‌ష్మీని వింత కోరిక కోరాడు. అత‌డు కోరిన కోరిక‌ను ఈ హాట్ భామ మ‌న్నించింది కూడా. అడ‌గ్గానే మ‌రో మాట లేకుండా త‌న ఆశ నెర‌వేర్చింది. దాంతో అభిమాని కూడా పొంగిపోయాడు.

అభిమాని అడిగిన కోరిక ఏంటంటే?

గిరిధర్ అనే రష్మీ అభిమాని…త‌న పుట్టిన రోజు నాడు ర‌ష్మీని విష్ చేయ‌మ‌ని అడిగాడు. దానికోసం ట్విట్టర్‌లో ఓ పెద్ద లెట‌ర్ కూడా రాశాడు.

చదవండి: రాజ్ తరుణ్-నిత్యామీనన్‌లు జంటగా వెరైటీ లవ్ స్టోరీ!
‘ర‌ష్మీ గారు.. ఈ రోజు నా పుట్టిన‌రోజు.. మీరు విష్ చేయాల‌ని కోరుకుంటున్నాను.. అది కూడా నా పేరు పెట్టి.. అలా మీరు విష్ చేయ‌క‌పోతే నా జీవితంలో ఈ పుట్టిన‌రోజు వేస్ట్ అయిపోతుందని పెట్టాడు.

అభిమాని కొంచెం ఎమోష‌న‌ల్‌గా పోస్ట్ చేయడంతో….దానికి ర‌ష్మీ కూడా పాజిటివ్‌గానే స్పందించింది. హ్యాపీ బ‌ర్త్ డే అంటూ విష్ చేసింది. కాక‌పోతే పేరు లేకుండా విష్ చేసింది. అయినా కూడా వెంట‌నే థ్యాంక్యూ మేడ‌మ్ అంటూ గిరి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

చదవండి: అంచనాలు పెంచేసిన కల్కి ట్రైలర్…