మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న రెబల్ స్టార్ !

11:45 am, Tue, 26 March 19
Saho Latest News, Prabhas Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్ : సాహో’ షూటింగు చాలా వరకూ పూర్తికావడంతో, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ సినిమాపై ప్రభాస్ దృష్టిపెట్టాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, రీసెంట్ గా మరో షెడ్యూల్ ను మొదలుపెట్టింది.

తొలిసారి మెప్పిస్తాడా..

1960 కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా సాగుతుందనే వార్తలు ఇంతకుముందే వినిపించాయి. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.

కథాపరంగా ఆయన ఒక పాత్రలో సిన్సియర్ లవర్ గా .. మరో పాత్రలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇక ఇప్పటివరకూ ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డే పేరు మాత్రమే వినిపించింది.

మరో కథానాయికగా కాజల్ కనిపించనుందనేది కూడా తాజాగా తెలిసిన విషయమే. సిన్సియర్ లవర్ కి జోడీగా పూజా హెగ్డే .. ప్లే బాయ్ పాత్ర సరసన కాజల్ కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయాలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయమని చెప్పుకోవచ్చు