సెగలు పుట్టిస్తున్న ‘కిస్’ టీజర్.. కుర్రకారు గుండెల్లో సెగలు

11:31 am, Sat, 4 January 20

హైదరాబాద్: జీఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్2పై శివ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిస్’. ధరణ్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ నెల 2న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

రొమాంటిక్‌గా ఉన్న ఈ టీజర్ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. టీజర్‌ని ముద్దులతో ముంచెత్తారు. ‘దెయ్యం వయాగ్రా మింగితే’ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. టీజర్ విడుదల సందర్భంగా దర్శకనిర్మాత శివ మాట్లాడుతూ.. దెయ్యం వయాగ్రా మింగితే.. అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు చెప్పారు.

ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ భాషలోనూ సినిమా రాలేదన్నారు. నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయంపై పూర్తి విశ్వాసంగా ఉన్నట్టు చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని శివ అన్నారు.