రాజమౌళి చెప్పిన ఆర్ ఆర్ ఆర్ సీక్రెట్!

12:14 pm, Thu, 14 March 19
RRR secrete says to Rajamouli, Newsxpressonline
హైదరాబాద్:  తాను చిన్నతనం నుంచి కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రలు విని ఇన్ స్పైర్ అవుతూ పెరిగానని, వాటి ఆధారంగా అల్లుకున్న కథతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథను తయారు చేసుకున్నానని దర్శక దిగ్గజం రాజమౌళి వెల్లడించారు. 

1920లో జరిగిన కథ…

తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాపై తొలిసారిగా మీడియాతో మాట్లాడిన రాజమౌళి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని చెప్పాడు రాజమౌళి.
 
తాను ప్రతి సినిమా కథనూ ముందే చెబుతుంటానని, ఈ సంగతి అందరికీ తెలుసునని, కానీ ఈ సినిమా విషయంలో కాస్తంతా ఆలస్యం చేయడం వెనుక సరైన కారణమే ఉందని అన్నారు. సినిమా కథను ముందే చెప్పడం తనకు ఇష్టం లేకపోయిందని అన్నారు.