సాయితేజ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా?

SAIDHARAM-TEJ
- Advertisement -

హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ న్యూమరాలజీ ప్రకారం తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ సతమతమైపోతుంటే ఆయనకి ఈ సలహాను ఇచ్చింది దర్శకుడు మారుతినట.

సాయితేజ్ గా పేరు మార్చుకున్నాక ఆయన చేసిన ‘చిత్రలహరి’కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక నుంచి సాయితేజ్ పేరుతోనే కొనసాగాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ఈ నేపథ్యంలో సాయితేజ్ తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో వుండనుందా అనే ఆసక్తి అందరిలోను తలెత్తింది.

మారుతి దర్శకత్వంలోనే ఆయన సినిమా వుండనుందనేది తాజా సమాచారం. శైలజా రెడ్డి అల్లుడు తరువాత మారుతి ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథను సాయితేజ్ తో చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా వుండనుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

- Advertisement -