బన్నీతో మనస్పర్ధల పై క్లారిటీ ఇచ్చిన సాయితేజ

4:06 pm, Thu, 18 April 19
sai tej

హైదరాబాద్: తాజాగా సాయిధరమ్ తేజ్ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ‘మీకు .. బన్నీకి మధ్య మనస్పర్థలు వున్నాయనే టాక్ వుంది. ఇందుకు మీ సమాధానం ఏమిటి?’ అనే ప్రశ్న సాయిధరమ్ తేజ్ కి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ మెగా ఫ్యామిలీలో నేను చరణ్ .. వరుణ్ తేజ్ లతో ఎక్కువ చనువుగా వుంటాను. ఇక స్టైలింగ్ కి సంబంధించిన సలహాలు సూచనల కోసం బన్నీని కలుస్తుంటాను.
మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు .

అందరం కలిసిపోయే ఉంటాము. చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగిన వాళ్లం. పండుగలన్నీ కలిసే జరుపుకున్న వాళ్లం. చరణ్ .. బన్నీ బయట స్టార్స్ అయినా, ఇంటికి వెళితే ఆ స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి ఎప్పటిలానే హ్యాపీగా మాట్లాడతారు.

నాకు .. బన్నీకి మధ్య మనస్పర్థలు అనే మాట ఇండస్ట్రీలో షికారు చేస్తుందంటే అదంతా పుకారేగానీ, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు’ అని చెప్పుకొచ్చాడు.