‘‘మా ఆయనతో సమంత కేక్ కటింగ్.. నేను హర్ట్..’’: శ్రీరెడ్డి తాజా సంచలనం

4:36 pm, Mon, 8 July 19
actress-sri-reddy-comments-on-samantha-and-abhiram

హైదరాబాద్: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్‌బుక్ పోస్టులో అక్కినేని సమంత, దగ్గుబాటి అభిరామ్‌లపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఓ బేబీ’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌కి సమంత మా ఆయన్ని మాత్రమే పిలిచి కేక్‌లు కట్ చేసుకున్నారు. నేను హర్టూ.. మా ఆయన కోతి వేషాలు చూడండహో..’ అంటూ శ్రీరెడ్డి తాజా పోస్టులో పేర్కొంది.

అయితే అక్కినేని సమంత తాజా చిత్రం ‘ఓ బేబి’ హిట్ అవడం కరెక్టే. దీంతో ఆ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించడం, అందులో కేక్ కట్ చేయడం అన్నీ కరెక్టే.

చదవండి: ‘‘జూనియర్ ఎన్టీఆర్‌తో అఫైర్.. మా ఇంట్లో తెలిసింది.. అందుకే సినిమాలకు దూరమయ్యా..’’

అయితే ఈ కార్యక్రమానికి శ్రీరెడ్డి భర్తను సమంత ఆహ్వానించడం ఏమిటి? దానికి శ్రీరెడ్డి తాను హర్టయ్యానంటూ పోస్టు పెట్టడం ఏమిటి? అసలు శ్రీరెడ్డి తన భర్తను వదిలేసి సింగిల్‌గానే ఉంటోందిగా.. ఇప్పుడీ కొత్త భర్త ఎవరు? అనేగా మీ డౌటు.

ఎవరీ అభిరామ్ అంటే…

అయితే శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేసింది.. అభిరామ్ గురించి. ఈయన దగ్గుబాటి వారసుడు. దివంగత రామానాయుడికి మనవడు. ఇంకా విడమరిచి చెప్పాలంటే.. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు.. బాహుబలిలో ప్రతినాయకుడైన రానాకి తమ్ముడు. అయితే దగ్గుబాటి అభిరామ్‌కి, శ్రీరెడ్డికి సంబంధం ఏమిటంటారా?

దగ్గుబాటి అభిరామ్ గతంలో శ్రీరెడ్డికి బాయ్‌ఫ్రెండ్. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చేవరకు దగ్గుబాటి అభిరామ్ పేరు చిత్రపరిశ్రమలోని వారికి తప్ప బయట ఎవరికీ పెద్దగా పరిచయం లేదు.

చదవండి: ఆర్య భార్యతో.. అఖిల్ రొమాన్స్!? ఫస్ట్ కాంబినేషన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందా?

తన తాత రామానాయుడు, తండ్రి సురేష్ బాబుల వారసుడిగా టాలీవుడ్‌లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో నిర్మాతగా ఆరంగేట్రం చేద్దామని అనుకుంటున్న తరుణంలో.. నటి శ్రీరెడ్డి అభిరామ్‌తో తనకున్న బంధం గురించి వివరిస్తూ ముందే సినీ జనాలకు పరిచయం చేసింది.

అప్పట్లో అలా సంచలనం…

అయితే దగ్గుబాటి అభిరామ్ సినీ ఇండస్ట్రీకి ఒక విధంగా పరిచయం కావాలని అనుకుంటుంటే.. అతడ్ని శ్రీరెడ్డి మరో రకంగా ఇండస్ట్రీకి పరిచయం చేసేసింది. తనను అభిరామ్ శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ అప్పట్లో సంచలనం సృష్టించిందామె.

అంతేకాకుండా తనతో బాగా చనువుగా ఉన్న దగ్గుబాటి అభిరామ్‌కి సంబంధించిన ఫొటోలను, తమ రాసలీలలకు సంబంధించిన మరికొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శ్రీరెడ్డి పెనుదుమారమే రేపింది.

ఈ ఒక్క ఇష్యూతో దగ్గుబాటి అభిరామ్ పేరు రాత్రికి రాత్రే అటు సినీ వర్గాల్లో, ఇటు జనాల్లో మారుమోగిపోయింది. ఎంతలా అంటే.. ‘బాహుబలి’ సినిమాతో అతడి అన్న రానాకు వచ్చిన క్రేజ్ కంటే కూడా అభిరామ్ గురించి తెలుసుకోవడానికే ఆసక్తి చూపించారు అందరూ. అలా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి, అభిరామ్‌ ఇష్యూ.. ఆ స్థాయిలో హాట్ టాపిక్ అయిపోయింది.

చదవండి: ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ రిలీజ్! ఇంత ఎనర్జీని ప్రేక్షకులు తట్టుకోగలరా?

ఇక అప్పట్నించి శ్రీరెడ్డి అవకాశం, సందర్భం దొరికినప్పుడల్లా.. దగ్గుబాటి అభిరామ్‌ను తన భర్తగా, సురేష్ బాబును మామ అని, రానాను బావ అంటూ.. చివరికి హీరో వెంకటేష్‌ను చిన మామ అని వరసలు కలిపేస్తూ ఏవేవో పోస్టులు వదులుతోంది.

ఈ లెక్కన సమంత, నాగ చైతన్యలు కూడా ఆమెకు వరసే కావడంతో.. అప్పుడప్పుడు వాళ్లపైన కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ వస్తోంది.

ఇక అసలు విషయానికొస్తే…

తాజాగా అక్కినేని సమంత నటించిన ‘ఓ బేబి’ సినిమా శుక్రవారం విడుదలై విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా సమంత యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసింది. సురేష్ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ చిత్రం విడుదల కాగా.. నిర్మాత హోదాలో దగ్గుబాటి అభిరామ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు.

చదవండి: ఎంతో పొందాను.. ఇంకెంతో కోల్పోయాను, అందుకే నటనకు గుడ్ బై!: ‘దంగల్’ ఫేమ్ జైరా వాసిం…

ఈ సందర్భంగా సమంత అతడికి కేక్ తినిపించింది. అనంతరం యూనిట్ సభ్యులతో కలిసి డాన్స్‌లు చేస్తూ.. వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఈ సందర్భాన్ని కూడా శ్రీరెడ్డి వదల్లేదు. దీనిపై తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టింది.

అందులో.. ఈ వేడుకకు సమంత తన భర్త (శ్రీరెడ్డి వూహలో) అభిరామ్‌ను మాత్రమే పిలిచిందని.. తనను పిలవలేదని, అందుకు తాను హర్ట్ అవుతున్నానంటూ సెటైరికల్‌ కామెంట్స్ చేసింది. ఇదిగో ఆ పోస్టును మీరూ చూడొచ్చు…