మన్మథుడు 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత!

6:16 pm, Wed, 1 May 19
Manmadhudu 2 Movie News, Samantha Latest News, Tollywood Movie News, Newsxpressonline

హైదరాబాద్: నాగార్జున కథానాయకుడిగా గతంలో వచ్చిన మన్మథుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు మన్మథుడు 2 రూపొందుతోంది. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ‘పోర్చుగల్’లో జరుగుతోంది.

రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది నిజమా? కాదా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. ఆ సందేహాలకు తెరదించేస్తూ ఈ సినిమా షూటింగులో సమంత జాయినైంది.

పోర్చుగల్ లో జరుగుతోన్న షూటింగులో సమంత నిన్న జాయినైంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

చదవండి:  ఆర్ఆర్‌ఆర్‌లో సముద్రఖని! ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలుసా?