‘మజిలీ’ కోసం తమన్‌కి మెసేజ్ చేసిన సమంత?

12:20 pm, Thu, 21 March 19
Akkineni Samantha Latest News, Majili Latest Movie News, Newsxpressonline

హైదరాబాద్: అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య , సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమా నిర్మితమైంది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆడియోకి మంచి పేరు వచ్చింది.

సమంత కోసం ఒకే చేశాడా..

అయితే ఏమైందో తెలియదుగానీ, రీ రికార్డింగ్ చేయడం మాత్రం కుదరదని గోపీసుందర్ చెప్పేశాడట. రీ రికార్డింగ్ చేస్తానని చెప్పి దానికి డబ్బు కూడా తీసుకున్న ఆయన, ఇలా చివరి నిమిషంలో చేయనని చెప్పడంతో తమన్‌ను సంప్రదించి ఒప్పించారట.

ఐతే సమయం తక్కువగా ఉండటంతో తమన్ కి సమంత ఓ మెసేజ్ పెట్టిందట. పెళ్లి తరువాత తాను చైతూ కలిసి చేసిన సినిమా ఇదనీ, సమయం తక్కువగా ఉన్నప్పటికీ మంచి రీ రికార్డింగ్‌తో సినిమాను నిలబెట్టే బాధ్యత ఆయనదేననీ .. ఎక్కడా ఫీల్ మిస్సవకుండా చూడమని రిక్వెస్ట్ చేసిందట. ప్రస్తుతం తమన్ ఆ పనిలోనే ఉన్నాడని అంటున్నారు.