ఆ 47 రోజుల్లో ఏం జరిగింది? ప్రస్తుతానికి ట్రైలర్‌ మాత్రమే.. ఈ నెల 30న ఫుల్ మూవీ…

Satyadev-47-Days-Official-Trailer-Released
- Advertisement -

హైదరాబాద్: మనిషి జీవితమే పెద్ద మిస్టరీ అనుకుంటే.. అంతకంటే పెద్ద మిస్టరీ ఓ అమ్మాయి రూపంలో ఓ అబ్బాయి జీవితంలోకి ప్రవేశిస్తుంది. 

మరి ఈ మిస్టరీని ఆ అబ్బాయి ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఇలాంటి అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమే.. ‘47 డేస్’.

- Advertisement -

సత్యదేవ్ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా ఝవేరి, రోషిణి ప్రకాష్, రవివర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రదీప్ మద్దాలి. 

తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం ఈ నెల 30న ఓటీటీ వేదికల్లో ఒకటైన జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ట్రైలర్‌ మీరూ చూసేయండి.

 

- Advertisement -