హ్యాట్సాఫ్: అడవి తగలబడకుండా కాపాడిన నటుడు సాయాజీ షిండే…

11:14 am, Mon, 9 March 20

పూణె: టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అడవి అగ్నికి ఆహుతి కాకుండా ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తికి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.

చదవండి: సెలవులో నరేశ్.. ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ

ఇంతకీ ఏం జరిగిందంటే?.. మహారాష్ట్రలోని పూణె శివార్లలో ఉన్న కాట్‌రాజ్ ఘాట్ రోడ్డులో నిన్న ఆయన తన కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అడవి తగలబడుతుండడం చూసి వెంటనే అప్రమత్తమయ్యారు.

మంటలు ఎగసిపడుతున్నా…

వెంటనే కారు ఆపి కిందికి దిగి తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లారు. సమయానికి చెంత నీళ్లు లేకపోవడంతో పచ్చి తుప్పలు పట్టుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఎగసిపడుతున్నా వెనకడుగు వేయకుండా మంటలు ఆపే ప్రయత్నం చేశారు.

ఆయనకు ఆ తర్వాత కార్పొరేటర్ రాజేష్ బరాతే కలవడంతో ఇద్దరూ కలిసి కష్టపడి మంటలను అదుపు చేసి పెను ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు.

చదవండి: చిరంజీవిని‘రాజ్యసభ’కు పంపబోతున్నట్టు ప్రచారం.. స్పందించిన నాగబాబు

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు షిండేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనకున్న సామాజిక స్పృహకు హ్యాట్సాప్ చెబుతున్నారు.