అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు

6:28 am, Thu, 14 November 19

హైదరాబాద్: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు (79) ఆసుపత్రిలో చేరారు.

గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు.

కృష్ణంరాజును పరీక్షించిన వైద్య నిపుణులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.