నన్ను పోర్న్‌స్టార్ అన్నారు.. రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నా: పాయల్ రాజ్‌పుత్

3:30 pm, Mon, 7 October 19
payal-rajput-about-rdx-love

హైదరాబాద్: తన తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్10’ తోనే హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోని మోసం చేసే నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ అత్యంత బోల్డ్‌గా నటించి మెప్పించింది.

మళ్లీ త్వరలోనే పాయల్ ఇలాంటి మరో సంచలన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం పేరు ‘ఆర్డీఎక్స్ లవ్’. ఈ సినిమాలో కూడా పాయల్ బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ చూస్తేనే అది అర్థమవుతోంది. అయితే ఈ చిత్రం టీజర్ విడుదలయ్యాక పాయల్‌పై, సినిమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

‘‘నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు…’’

అయితే ఆ విమర్శలపై పాయల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘ఆర్డీఎక్స్ లవ్’ టీజర్ చూసిన తర్వాత చాలా మంది తనను తీవ్రంగా విమర్శించారని, కొంతమంది తనను ‘పోర్న్‌స్టార్’ అని కూడా అన్నారని పాయల్ చెప్పింది.
 
ఆ మాటలు విన్నాక తనకు చాలా బాధ కలిగిందని, వాటినే గుర్తుచేసుకుంటూ ఓ రాత్రంతా ఏడుస్తూ గడిపానని.. అయితే ఆ తర్వాత అలాంటి విమర్శలను తాను పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు, అయినా బోల్డ్ డైలాగ్స్, బోల్డ్ సీన్లు ఉన్న పాత్రను తాను కాకపోతే ఇంకెవరు చేస్తారు? అంటూ ప్రశ్న కూడా వేసింది హాట్ హాట్ పాయల్ రాజ్‌పుత్. దీన్ని బట్టి అర్థమవుతోందిగా.. రాబోయే ‘ఆర్డీఎక్స్ లవ్’‌లో పాయల్ అందాల ఆరబోత ఏ స్థాయిలో ఉంటుందో! ఇదిగో.. ఆ టీజర్.. మీరూ ఓ లుక్కేయండి మరి!!