ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం.. ఐసీయూకి తరలింపు

- Advertisement -

చెన్నై: ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నారు. గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురవడంతో ఆయన్ని ఐసీయూకి తరలించారు.

బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ బారిన పడి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే ఆగస్టు 5న స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. 

- Advertisement -

మూడు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో తాను ఎందుకైనా మంచిదని కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని బాలు తెలిపారు. 

మందులు ఇచ్చి హోమ్ క్వారంటైన్‌లో ఉండమని తనకు వైద్యులు సూచించారని, అయితే కుటుంబ సభ్యులను ఇబ్బందిలో పడేయడం ఇష్టం లేక తానే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. 

ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తాను చాలా ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కరోనాను జయించి తిరిగి వస్తానని ఆ వీడియోలో ఆయన తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

బాలసుబ్రమణ్యంకు చికిత్స అందిస్తోన్న చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు శుక్రవారం బులి ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారాన్ని ఓ బులెటిన్ ద్వారా విడుదల చేశాయి.

ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని, వైద్య చికిత్స ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైందని వైద్యులు పేర్కొన్నారు. 

అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురయ్యారని, దీంతో వైద్య నిపుణుల సూచన మేరకు ఆయన్ని వెంటనే ఐసీయూకి తరలించామని తెలిపారు. 

ప్రస్తుతం ప్రత్యేక వైద్య నిపుణుల బ‌ృందం నిరంతరం బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆయనకు చికిత్స అందిస్తోన్న వైద్యలు వివరించారు. 

- Advertisement -