నాన్న వైద్యానికి సహకరిస్తున్నారు: ఎస్పీ చరణ్

- Advertisement -

హైదరాబాద్‌: తన తండ్రి వైద్యానికి సహకరిస్తున్నారని ప్రముఖ  గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. నిన్నటి కంటే ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడిందని అన్నారు. 

 విషమ పరిస్థితి నుంచి కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయని, అందరి ప్రార్థనలు, ఆశీస్సులతో బాల సుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

 ఈనెల 5వ తేదీన ఎస్పీ బాలుకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే, ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు ఇబ్బంది అని భావించిన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.

బాలు ఆరోగ్య పరిస్థితి నిన్న విషమించడంతో వెంటనే ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తుండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

- Advertisement -