మరింత మెరుగైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం.. ఫేస్‌బుక్‌లో వీడియో షేర్ చేసిన ఎస్పీ చరణ్

- Advertisement -

చెన్నై: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్నటి కంటే నేడు మరింత కోలుకున్నారని ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఫేస్‌బుక్‌లో ఒక వీడియో షేర్‌ చేశారు.

అందులో ఆయన మాట్లాడుతూ ‘‘నాన్న ఆరోగ్యం రోజు రోజుకూ మెరుగవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇంకాస్త కోలుకున్నారు. ఊపిరితిత్తుల్లో మెరుగుదల ఉంది. వైద్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. నాన్నగారు కోలుకోవాలని ప్రార్థన కొనసాగించాలి’’ అని చరణ్‌ అభ్యర్థించారు. 

- Advertisement -

బాలుకు ఆగస్టు 5న కరోనా సోకగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. 14న ఆయన ఆరోగ్యం క్షీణించగా ఐసీయూకు తరలించి మెరుగైన వైద్యం అందించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం ఐసీయూలో, ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ చేస్తున్నామని, ప్రత్యేక వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పరిశీలిస్తున్నారని చరణ్  పేర్కొన్నారు. 

- Advertisement -