రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలంక సుందరి..!

11:31 am, Fri, 26 April 19
Rajamouli Latest News, RRR Movie Latest News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరు? బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న తర్వాత పలువురి పేర్లు వినిపించినా ఇప్పటి వరకు ఎవరూ కన్ఫర్మ్ కాలేదు.

బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, పరిణితి చోప్రా, కృతిసనన్.. దక్షిణాది భామ నిత్యా మీనన్ తదితరుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. వీటిపై దర్శకుడు రాజమౌళిగాని ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్ సభ్యులుగాని స్పందించలేదు.

దీంతో ఇప్పటి వరకు ఆ పుకార్లు షికార్లు చేశాయి. అయితే రాజమౌళి దృష్టిలో వీరెవరూ లేరట. విదేశీ భామ కోసమే ఆయన అన్వేషణ సాగిస్తున్నారట. కథ ప్రకారం.. విదేశీ భామకు, ఎన్టీఆర్‌కు మధ్య లవ్ ట్రాక్ ఉందట.

అందువల్లనే, డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకోవడం. అయితే ఆమె అనూహ్యంగా తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో విదేశీ భామను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట.

ఎన్టీఆర్ సరసన జాక్వలిన్ ఫెర్నాండేజ్!?

ఈ తరుణంలో రాజమౌళికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారట. శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని కథానాయికగా తీసుకోమని ఆయన చెప్పారట. అవ్వడానికి జాక్వలిన్ శ్రీలంక దేశస్థురాలే అయినా ఆమెలో బ్రిటిష్ పోలికలు అధికం.

సో, ఎన్టీఆర్‌కు జోడీగా జక్కన్న ఆమెను ఎంపిక చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’లో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు.

సినిమాలో మరో హీరో రామ్ చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సరసన జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా ఎంపికైతే ఈ సినిమాకు బాలీవుడ్‌లో మరింత క్రేజ్ రావడం ఖాయం.

చదవండి: ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్!?