నాని బాబు.. జ‌స్ట్ ల‌వ్యూ అంతే : ఎస్ ఎస్ రాజమౌళి

12:45 pm, Mon, 22 April 19
Rajamouli

హైదరాబాద్: నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ’ .. ఈ నెల 19వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. క్రికెటర్ గా నాని నటించిన ఈ సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు వుండేవి కావు.

టీజర్ ట్రైలర్ బయటికి వచ్చాక ఒక్కసారిగా ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి పెరిగింది. విడుదల తరువాత ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది.సినీ ప్రముఖులంతా కూడా ఈ సినిమా చూసి, టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆ జాబితాలోకి తాజాగా రాజమౌళి కూడా చేరిపోయారు. ఈ సినిమా చూసిన రాజమౌళి స్పందిస్తూ సినిమా చాలా బాగుంది.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతంగా తెరకెక్కించాడు. సన్నివేశాలను రాసుకున్న తీరు, తెరపై వాటిని ఆవిష్కరించిన తీరు హృదయానికి హత్తుకునేలా వున్నాయి. నాని తన పాత్రలో ఇమిడిపోయి ప్రతి సన్నివేశాన్ని పండించిన తీరు బాగుంది అంటూ దర్శకుడిని నానీని అభినందించారు.