బాలకృష్ణ సినిమాలో విలన్ గా స్టార్ హీరోయిన్!

4:46 pm, Fri, 10 May 19
Balakrishna Latest Movie News, Tollywood Latest News, Telugu Movie News, Newsxpressobline
హైదరాబాద్: టాలీవుడ్ లో మాస్ హీరోలు కొందరే ఉంటారు. ఆ కొందరి సినిమాలు ఎలా ఉన్నా సరే మాస్ కు కనెక్ట్ అవుతుంటాయి. అలాంటి మాస్ హీరోలో ఒకరు మన నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ మిగిల్చిన చేదు అనుభవాల నుంచి బయటపడ్డ బాలకృష్ణ , బోయపాటి శ్రీను, రవి కుమార్ లతో సినిమా చేయబోతున్నారు.

మొదట బోయపాటి శ్రీను సినిమా సెట్ అవుతుంది అనుకున్నా కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో బాలయ్య రవికుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. జైసింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన సి కళ్యాణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది. ఇందులో కోలీవుడ్ విలక్షణ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం.

ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. లెజెండ్ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కు పరిచయమైన జగపతిబాబు మెయిన్ విలన్ గా చేస్తున్నారు. మే 17 వ తేదీన ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. ఇందులో నటించే మిగతా క్యాస్టింగ్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.