మహర్షి చిత్రాన్ని చూసిన కృష్ణ ఏంచెప్పాడో తెలుసా!

11:27 am, Fri, 10 May 19
krishna watch the maharshi

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.  మహేశ్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ మంచి టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇకపోతే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ కుటుంబసభ్యులతో కలసి ఈ చిత్రాన్నిచూసారు. విజయనిర్మల, నరేశ్ లతో పాటు ఇతర కుటుంబసభ్యులతో కలసి సినిమా చూశారు. సినిమా అయిపోయిన తరువాత  కృష్ణ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. విద్యార్థిగా, వ్యాపారవేత్తగా, రైతుగా మూడు పాత్రల్లో మహేశ్ నటన అదిరిపోయిందని చెప్పాడు.

అలాగే  నరేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను తాను చూడటం ఇది రెండో సారని చెప్పారు. రైతు పాత్రలో మహేశ్ ఒదిగిపోయాడని, రైతులకు గౌరవాన్ని ఇవ్వాలనే సందేశం తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. మహేశ్ కెరీర్లో ఈ చిత్రం ఒక మైలు రాయిగా మిగులుతుందని చెప్పారు. మహేష్ బాబు కి శుభాకాంక్షలు తెలిపాడు.