హీరోయిన్‌గా నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత

1:06 pm, Mon, 10 February 20

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కేరెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై పలు కార్యక్రమాలకి యాంకర్‌గా కూడా వ్యవహరించారు.

ఇటీవల ఆమె భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే. వీరి అమ్మాయి సుప్రీత త్వరలో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

సుప్రీత ప్రస్తుతం చదువుకుంటునే, తన తల్లికి ఇష్టమైన సినీ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఆమె నటించిన కొన్ని ఎపిసోడ్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.

వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ లో వీడియోలు చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో హీరోయిన్‌గా తన కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేయాలని సురేఖవాణి భావిస్తున్నట్టు తెలుస్తోంది.