సైరా కోసం సాహసాలు చేస్తున్న మెగాస్టార్! టెంక్షన్స్ లో మెగా అభిమానులు!

1:57 pm, Mon, 6 May 19
sairaa

హైదరాబాద్: సైరా నరసింహారెడ్డి ఈ చిరంజీవి తాజా చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అందుకే సినిమా యూనిట్ కూడా ఏమాత్రం రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్ కోసం చిరంజీవి చాలా రిస్క్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు చిరంజీవి వయస్సు 63 ఏళ్లు.. కానీ ఈ వయస్సులోనూ ఆయన ఫైట్ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. చారిత్రక సినిమా కావడంతో యాక్షన్‌కు చాలా స్కోప్ ఉంటుంది. దాన్ని చిరంజీవి సద్వినియోగం చేసుకుంటున్నారట.

ముష్టియుద్ధాల వంటి సీన్లలోనూ డూప్ అవసరం లేకుండా రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది. కత్తి పోరాటాలు వంటి సాహసాలు ఈ సినిమాలో అనేకం ఉన్నాయట. వాటిలో చాలావరకూ బయటకు పొక్కకుండా యూనిట్ జాగ్రత్తపడుతోంది.

చిరంజీవి వయస్సు రీత్యా రిస్క్ తగ్గించుకోమని యూనిట్ చెబుతున్నా.. చిరంజీవి మాత్రం ఒరిజినాలిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారట. చిరంజీవి సినీ చరిత్రలో నిలిచిపేయాలా ఈ సినిమా రూపొందాలన్నదే ఆయన డ్రీమ్. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది.