సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతి.. విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, చిరంజీవి

8:07 am, Sat, 18 May 19

హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలోతనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రాళ్లపల్లి తనువు చాలించారు. 850 పైగా సినిమాల్లో నటించిన రాళ్లపల్లి నర్సింహా రావు… హైదరాబాద్‌లోని మెడీక్యార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

1955, అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించిన రాళ్లపల్లి… తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ‘చిల్లరదేవుళ్లు’, ‘చలిచీమలు’, ‘అభిలాష’, ఖైదీ, అన్వేషణ వంటి ఎన్నో చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన నటించారు.

చదవండితీవ్ర విషాదంలో మెగాస్టార్! ‘సైరా’లో మరో అపశృతి!

ఇక సినీ నటుడు రాళ్లపల్లి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమని, తనదైన శైలిలో సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.

రాళ్లపల్లి మరణవార్త తెలిసి జగన్ ఎంతో విచారానికి లోనయ్యారంటూ వైసీపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రాళ్లపల్లి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

రాళ్లపల్లి మృతికి చిరంజీవి సంతాపం..

రాళ్లపల్లి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నై వాణీమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లిని కలిశానని చిరంజీవి వెల్లడించారు. రాళ్లపల్లి నటన సహజంగా ఉంటుందని, అందుకే ఆయన నటన అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

చదవండి: ఉద్యోగం కోసం సౌదీ వెళ్ళి నరకం చూస్తున్న యువతి….