సమంత మజిలీ సక్సెస్ మీట్ కి రాకపోవడానికి కారణం అదేనా!

7:42 am, Wed, 17 April 19
samantha

హైదరాబాద్: మజిలీ’ సక్సస్స్ మీట్ కు వచ్చిన మీడియా ప్రతినిధులకు ఊహించని షాక్ తగిలింది. ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ సక్సస్స్ మీట్ కు సమంత డుమ్మా కొట్టడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

అంతేకాదు ‘మజిలీ’ సక్సస్స్ గురించి విపరీతమైన టెన్షన్ పడ్డ సమంత చివరకు ఆ మూవీ టీమ్ జరుపుకున్న ఘనంగా నిర్వహించిన సక్సస్ మీట్ కు సమంత ఎందుకు రాలేదు అన్న చర్చలు ఆ సక్సస్ మీట్ లోనే జరిగినట్లు సమాచారం.

అయితే ఈసినిమాలో మరో హీరోయిన్ గా నటించిన దివ్యాంక కౌశిక్ ఈ ఫంక్షన్ కు రావడంతో మీడియా దృష్టి అంతా ఆమె పై పడింది. దీనికితోడు చైతన్య ఈ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఒక్క మాట కూడ సమంత గురించి మాట్లాడక పోవడంతో పాటు ఆమె యాక్టింగ్ స్టిల్స్ గురించి చైతు నోటివెంట ఒక్క ప్రశంస కూడ రాకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

చైతన్య మాట్లాడుతూ ఈమూవీ సక్సస్ ఒక్కరివల్ల వచ్చింది కాదనీ అందరు కష్టపడటంతో ఈమూవీ విజయవంతం అయింది అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈమూవీ నిర్మాతలు సమంత బిజీగా ఉండటంతో ఈ సక్సస్ మీట్ కు ఆమె రాలేకపోయిన విషయాన్ని ముందుగానే ప్రకటించారు.

అయితే ‘మజిలీ’ కి ఎంతో కీలకమైన సమంతకు అనువైన రోజున ఈ సక్సస్ మీట్ ను నిర్వహించుకోవచ్చు కదా సమంత లేకుండా ఇంత హడావిడిగా సక్సస్ మీట్ ను నిర్వహించవలసిన అవసరం ఏమి వచ్చింది అంటూ ఆ ఫంక్షన్ లో కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.

మరికొందరైతే సమంతకు దివ్యాంక కౌశిక్ కు మధ్య చిన్న గ్యాప్ ఉంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో సమంత కావాలనే ఈ సక్సస్ మీట్ కు డుమ్మా కొట్టిందా అన్న అనుమానాలు కూడా వెల్లడవుతున్నాయి..