ఆకట్టుకుంటోన్న ‘మహర్షి’ వీడియో సాంగ్

5:45 pm, Fri, 19 April 19
Mahesh Babu Latest News, Maharshi Movie Latest News, Tollywood News, Newsxpressonline

టాలీవుడ్: మహేశ్ బాబు 25వ చిత్రంగా ‘మహర్షి’ నిర్మితమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక సాంగ్ ను విడుదల చేశారు. “ఎవరెస్టు అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే” అంటూ ఈ పాట సాగుతోంది.

చాలా రిచ్ గా .. స్టైలీష్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ పాటలోను మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట కొత్తగా .. యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. దిల్ రాజు ..

అశ్వనీదత్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మహేశ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.