ఆర్ఆర్‌ఆర్‌లో సముద్రఖని! ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలుసా?

5:23 pm, Wed, 1 May 19
RRR Movie Latest Update News, SS Rajamouli Latest News, Samudrakani , Newsxpressonline
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెలుగు స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ కనిపించనుంది.

ఎన్టీఆర్ సరసన ఇద్దరు నాయికలు కనిపించనున్నారట. ప్రధాన నాయికను ఇంకా ఎంపిక చేయలేదు.
మొదట్లో ఈ పాత్ర కోసం బ్రిటీష్ భామని తీసుకోగా, ఆమె కొన్నికారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకుంది. రెండవ నాయికగా నిత్యామీనన్ ను తీసుకున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం తమిళ నట దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేసుకున్నారు. ఆయనను ఏ పాత్ర కోసం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు.

అంటే కొమరం భీమ్ కి బాబాయ్ పాత్రను పోషించనున్నాడన్న మాట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమనీ, అందుకే ఆయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుకానుంది.