నిజాన్ని ఎక్కువ కాలం దాచలేరు: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలపై వర్మ ట్వీట్

Ram-Gopal-Varma-on-Lakshmis-NTR
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.

ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ , ఆ నాటి నుండి ప్రతో రోజు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంది. వివాదాలతోనే షూటింగ్ చేసిన వర్మ ఏపీ మినహా అన్ని చోట్ల ఇప్పటికే ఈ సినిమాను రిలీజ్ చేశారు.

- Advertisement -
చదవండి:  ఇంతకీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా.. రేపు ఏపీలో రిలీజ్ అవుతుందా?

రామ్ గోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. మే 1న రిలీజ్ చేయాలని వర్మ ఎంతో పట్టుదల చూపించినా, అధికారులు ససేమిరా అంటున్నారు.

తాజా పరిణామాలపై వర్మ కోపం నషాళానికి అంటుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో మరోసారి అలవాటుగా ట్విట్టర్‌ను ఆశ్రయించారు.

శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులు చెబుతుండడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలోని థియేటర్ల నుంచి తొలగించినట్టు వర్మ ట్వీట్ చేశారు.

“సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, హైకోర్టు కూడా సరేనంది. అలాంటప్పుడు ఏం శాంతిభద్రతల సమస్యలు వస్తాయనుకుంటున్నారో నా సినిమా విడుదలను అడ్డుకుంటున్న శక్తులను అడగాలనుకుంటున్నా!” అని పేర్కొన్నారు.

చదవండి:  నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. వాటిపై సినిమా తియ్: వర్మకు దివ్యవాణి సవాల్
- Advertisement -