మహర్షి సినిమాలోని కీలక అంశాలు ఇవే!

12:42 pm, Sat, 4 May 19
Maharshi Latest News, Mahesh Babu News, Tollywood Movie News, Newsxpressonline

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. దిల్‌రాజు, అశ్వినీదత్‌, పివిపి నిర్మాతలు. మే 9న సినిమా విడుదలవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. టైటిల్స్ మినహా ఈ చిత్ర వ్యవథి 2 గంటల 55 నిమిషాలు. సెన్సార్ తర్వాత సినిమాపై పాజిటివ్ వైబ్స్ మరింత పెరిగాయి. ఇండస్ట్రీలో మహర్షి విషయంలో వినపడుతున్న సూపర్ పాజిటివ్స్‌:

1. స్టూడెంట్‌, బిలియనీర్‌, రైతు.. ఇలా మూడు షేడ్స్‌లో మహేశ్‌ బ్రలియంట్ పెర్ఫామెన్స్

2.మహేష్ 25వ సినిమా కావడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని చాలా కేర్‌తో తెరకెక్కించిన తీరు.

3. కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు.
4. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు.

5. డాన్‌, తలాష్‌, అంధాదూన్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన కె.యు.మోహనన్ తన టెక్నికల్ విజువల్స్‌తో సన్నివేశాలను అందంగా, రిచ్‌గా చూపించాడు.

6. ప్రొడక్షన్ వేల్యూస్‌

7. రైతుల సమస్య(రామవరం ఏపిసోడ్‌)

8. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు

9. మహేష్‌, అల్లరి నరేష్ మధ్య ఫ్రెండ్ షిప్ సన్నివేశాలు

10.మహేష్ ప్రెస్‌మీట్

11. నైట్ ఫైట్ సన్నివేశం

మొత్తంగా మహర్షి ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా, సెకండాఫ్ ఎమోషనల్‌గా ప్రతి అంశం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా తెరకెక్కించారట. రేపు సినిమా విడుదల తర్వాత మహేష్ మహర్షి ఎన్ని రికార్డులను కొల్లగొడతాడో చూడాలి.

చదవండి:  గ్రేట్: ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న‘మహర్షి’!