హాలీవుడ్ సినిమాలకి టాలీవుడ్ సినిమాలకి తేడా ఇదే!

3:39 pm, Fri, 26 April 19
Hollywood Latest News, Tollywood Latest News, Movie News, Newsxpressonline
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కలక్షన్స్ సునామి సృష్టిస్తూ విడుదలైన అవెంజర్స్ అండ్ గేమ్ కేవలం ఒక్క ఇండియాలోనే 2,300 ల ధియేటర్లలో ఈరోజు ఉదయం విడుదలైంది. ఈసినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అనేక ప్రముఖ నగరాలలో 24×7 షోలుగా ప్రదర్శింపబడుతూ ఉండటం ఈసినిమా పై మ్యానియాను సూచిస్తోంది.

ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒక్కరోజు 750 కోట్లు వసూలు చేస్తుంటే మన ఇండియాలో ఈమూవీకి ఈ ఒక్కరోజులో 200 కోట్ల కలక్షన్స్ రాబోతున్నాయి. ఈసినిమా టిక్కెట్ల కోసం గత కొద్దిరోజులుగా కొనసాగిన మ్యానియాను పరిశీలిస్తే ఈ వీకెండ్ లో ఈసినిమాను తప్ప మరేసినిమాను ప్రేక్షకులు చూడరా ? అన్న సందేహాలు కలుగుతాయి.
కేవలం బుక్ మై షో ద్వారా ఈమూవీ టిక్కెట్లు దేశ వ్యాప్తంగా 10 లక్షలు అమ్మకం జరిగింది అంటే ఈ మూవీ పై జనం క్రేజ్ ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది. ఇప్పటికే ఈమూవీని ఆకాశంలోకి ఎత్తేస్తూ అనేక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలు తమ రివ్యూలను ఇచ్చేసాయి.

అంతేకాదు 4/5 రేటింగ్ ల కంటే ఎక్కువగా ఈమూవీకి జాతీయ మీడియా సంస్థలు రేటింగ్ లు ఇస్తున్నాయి అంటే ఈసినిమా సృష్టించబోతున్న కలక్షన్స్ సునామీ అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈమూవీకి కొనసాగుతున్న మ్యానియా నాగచైతన్య సాయి తేజ్ నానీల ఉసురు పోసుకుంది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.

‘అవెంజర్స్’ మ్యానియాతో ‘మజిలీ’ జెర్సీ’ ‘చిత్రలహరి’ ఈ వీకెండ్ లో ఘోరంగా దెబ్బతినే ఆస్కారం ఉంది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒక హాలీవుడ్ సినిమా మ్యానియా ముందు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టుకు పోతున్నాయి అంటే మన ఇండియన్ సినిమాలు క్వాలిటీ పరంగా ఇంకా ఎంత ఎదగాలో అర్ధం అవుతుంది