మహేష్ ‘మహర్షి’లో.. కొత్తగా చేర్చిన సాంగ్ ఇదే!

11:26 am, Tue, 30 April 19
Mahesh Babu Latest Movie News, Maharshi Movie News, Tollywood News, Newsxpressonline

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్‌లో మహర్షి వైబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. మే 9న విడుదల కానున్న ఈ చిత్రంకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. మే 1న చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా జరపనున్నారు. సాయంత్రం చిత్రానికి సంబంధించిన ఆడియోని విడుదల చేయనున్నారు.

అయితే మహర్షి చిత్రంలో కొత్త పాటని చేర్చినట్టు మేకర్స్ తెలిపారు. ఫిర్ సే.. అనే పాటని కొత్తగా చేర్చినట్టు పోస్టర్ ద్వారా తెలిపిన టీం సాయంత్రం 4.05 ని.లకు ఈ పాట లిరికల్ వీడియోని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అల్లరి నరేష్.. మహేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు . భారీ ఎత్తున విడుదల కానున్నమహర్షి చిత్రంపై అభిమానులలో మేజర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

చదవండి:  రానా సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియమణి!