ప్లాస్మా దానం చేసి యోధుడిగా నిలవండి.. నటుడు మహేశ్‌బాబు పిలుపు

- Advertisement -
హైదరాబాద్: కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని టాలీవడు్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. 
 
 “ఇప్పుడు కావాల్సింది ప్లాస్మాయేనంటూ సైబరాబాద్ పోలీసులు ప్లాస్మా దానం గురించి ప్రచారం చేస్తున్నారు. కరోనాను జయించిన వ్యక్తులందరూ తమ ప్లాస్మాను దానం చేయాల్సిందిగా అర్థిస్తున్నాను.
 
ముందుకొచ్చి ప్లాస్మా దానం ప్రక్రియలో పాలుపంచుకోండి. తద్వారా కరోనా రోగుల ప్రాణాలు కాపాడండి. మీరూ ఓ ప్లాస్మా యోధుడిగా నిలవండి!” అని ట్విట్టర్ ద్వారా మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
 
- Advertisement -