నీ సేవలకు ప్రభుత్వం పద్మభూషణ్ ఇవ్వాలి: సోనూసూద్‌కు బ్రహ్మాజీ బర్త్‌డే శుభాకాంక్షలు

- Advertisement -

హైదరాబాద్: ఇటీవల మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోనూ సూద్. సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూ సూద్.. తన మంచి మనసుతో నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. 

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. క‌రోనా సంక్షోభంతో ఉద్యోగం పోయి కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న సాఫ్ట్‌వేర్ శార‌ద‌కు అండ‌గా నిలుస్తూ ఒక కంపెనీలో ఆఫ‌ర్ లెట‌ర్ ఇప్పించాడు.

- Advertisement -

లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చాడు. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు.

ఎవరు సాయం అడిగినా లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.  

సోనూసూద్ గురువారం 47వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ తెలుగు న‌టుడు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ బ్ర‌హ్మాజీ సోనూసూద్‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

‘హ్యాప్పీ బ‌ర్త్‌డే మై డియ‌ర్ సోనూసూద్‌.. క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు అండ‌గా నిలుస్తూ నిజ‌మైన హీరోలా నిలిచావు. నీ సేవ‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ప‌ద్మ భూష‌ణ్‌కు సిఫార్సు చేయాల‌ని కోరుకుంటున్నా.. నువ్వు నిజంగా మ‌హాత్ముడివి సోనూ ‘ అంటూ తెలిపాడు.

ఈ సంద‌ర్భంగా సోసూసూద్‌తో క‌ల‌సి దిగిన పాత ఫోటోను షేర్ చేశాడు. దీంతో పాటు ఏక్ నిరంజ‌న్ సినిమాలోని ఒక స‌న్నివేశాన్ని మీమ్స్‌గా  చిత్రీక‌రించి షేర్ చేశాడు.

ఆ ఫోటోలో.. ‘బ్ర‌హ్మాజీ.. ఈరోజు నా బ‌ర్త్‌డే.. ఏం ప్లాన్ చేద్దాం చెప్పు.. అని సోనూ అంటాడు. ఇంకేముంది.. పార్టీ చేసుకుందాం.. అని బ్ర‌హ్మాజీ అంటాడు.

దానికి సోనూ సీరియ‌స్‌గా అక్క‌‌డ జ‌నాలు.. అంత క‌ష్టాల్లో ఉంటే నీకు పార్టీ కావాలా.. పార్టీ లేదు ఏం లేదు.. పోయి కొంత‌మందికి స‌హాయం చేద్దాం..’ అంటూ పేర్కొన్నాడు.

- Advertisement -