ప్రభాస్‌ది ఎంత గొప్ప మనసో.. రెబల్ స్టార్ గురించి చెప్పిన హేమ

12:35 pm, Tue, 5 November 19

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ ప్రభాస్‌ది ఎంత గొప్ప మనసో అంటూ నటి హేమ పొగడ్తల వర్షం కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యక్రమానికి ప్రభాస్‌ను పిలిస్తే తాను రానని చెప్పాడని, కానీ ‘మా’కు కోటి రూపాయల విరాళం ఇస్తానని చెప్పాడని పేర్కొంది.

నువ్వు కోటి రూపాయలు ఇస్తావు కానీ నువ్వో ప్రోగ్రాం చేస్తే నీ కోటి రూపాయలతోపాటు మరో రెండుమూడు కోట్ల రూపాయలు వస్తాయని చెప్పానని, దానికి ప్రభాస్ ఓకే అన్నాడని పేర్కొంది. మీరు ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వస్తాను పిలవాలని చెప్పాడంటూ ప్రభాస్ మంచి మనసు గురించి చెప్పుకొచ్చింది.

చాలామంది హీరోలు సొసైటీకి తమ వంతు సాయం చేసి తెర వెనుక కూడా హీరోలు అనిపించుకుంటూ ఉంటారు. కొందరు బయటకి చెప్పుకుంటారు, మరికొందరు చెప్పుకోవడానికి ఇష్ట పడరు. అలాంటి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.